top of page

రాజకీయాల్లోకి స్టార్‌ హీరో విజయ్‌.. నా లక్ష్యం అదేనంటూ..🌟🤔

తమిళనాట ఉన్నన్ని పార్టీలు, గ్రూపులు దేశంలో మరెక్కడా ఉండవు. ఇప్పటికే వందకు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. తాజాగా తమిళ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి సిద్ధమయ్యారు.

అందుకు సబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకున్నారు. విజయ్ అభిమానులు ఎప్పటి నుంచి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఒక అభిమాన సంఘాన్ని నడుపుతున్నారు. విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరపున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరపున పోటీ చేసిన విజయ్ అభిమానులు 261 స్థానాలకు పోటీ పడగా 169 చోట్ల గెలుపొందారు.

నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఫలితాల తర్వాత కాస్త క్లారిటీ వచ్చింది. పొలిటికల్ ఎంట్రీకి ముందు జనం నుంచి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకే ఆ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయించారని అప్పట్లో టాక్. ఎట్టకేలకు విజయ్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కారణాలు, పార్టీ పెరు కూడా ప్రకటించేశారు. ట్విట్టర్ వేదికగా అభిమానులకు రెండు పేజీల లేఖను విడుదల చేశారు. తాను స్థాపించబోయే పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం గా పార్టీ పేరు ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. 🌟👍

bottom of page