top of page

డాన్స్ ఇరగదీసిన రాజమౌళి..✨🕺

తెలుగు డైరెక్టర్ ని ఇండియన్ డైరెక్టర్ గా మార్చిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (S. S. Rajamouli)ఉరఫ్ జక్కన్న. ఇందులో ఎవరకి ఎలాంటి డౌట్ లేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన సృష్టించిన సంచలనం అందరి కళ్ళ ముందు మెదులుతూనే ఉంది.

ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా  ప్లాప్ లు రావడం సహజం. కానీ జక్కన్న కి మాత్రం ఇంతవరకు అపజయం అనేదే లేదు. ప్రపంచ సినీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేత ప్రసంశలు అందుకున్న ఆయన  ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు.జక్కన్న భార్య పేరు రమ.ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కూడాను. జక్కన్న భారీ సినిమాల విషయంలో ఆమె  కాస్ట్యూమ్స్ కూడా ప్రముఖ  పాత్ర పోషిస్తాయి.  తాజాగా వాళ్లిద్దరూ కలిసి ఒక పబ్లిక్ స్టేజ్‌పై డాన్స్ చేసారు. డాన్స్ అంటే ఏదో అల్లాటప్పాగా  డాన్స్ వెయ్యడం  కాదు. ఒక సినిమాలో  హీరో హీరోయిన్లు ఎలా అయితే డాన్స్ చేస్తారో అచ్చం అలాగే వేశారు. ఇద్దరు పోటీ పడి మరి డాన్స్ చేసారు. పక్కా  ప్రొఫిషనల్స్ గా వేసిన ఆ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ప్రేమికుడి సినిమాలోని  అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటకు డాన్స్ చేసారు. అక్కడున్న వారంతా ఈలలు,అరుపులతో వాళ్ళని ఉత్సాహపరిచారు. ✨


bottom of page