top of page

శ్రీవిష్ణు సినిమా పై మాస్ రాజా రివ్యూ.. మనస్ఫూర్తిగా నవ్వుకున్నా అంటూ..

తాజాగా శ్రీవిష్ణు సామజవరాగమన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

యంగ్ హీరో శ్రీవిష్ణు సాలిడ్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అనుకున్న రేంజ్ లో హిట్ అందుకోలేకపోతున్నారు. కానీ శ్రీవిష్ణు ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి. తాజాగా శ్రీవిష్ణు సామజవరాగమన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కంప్లీయ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.సామజవరాగమన పై అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా పై సినిమా తారలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో శ్రీ విష్ణు, సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వీరి ముగ్గురి కామెడి టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

ఇక ఈ సినిమా పై మాస్ మహారాజ రవితేజ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకున్నా.. సినిమా చాలా బాగుంది అని తెలిపారు. దర్శకుడు రామ్ అబ్బరాజుకి , రైటింగ్ టీం కి నా శుభాకాంక్షలు అని తెలిపారు రవితేజ. మాస్ రాజా సినిమా పై ప్రశంసలు కురిపించడం పై శ్రీవిష్ణు స్పందించారు. రవితేజ మెచ్చుకోవడం ఆనందంగా ఉందని.. ఆయన ప్రశంస చాలా గొప్పదని శ్రీ విష్ణు తెలిపారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page