top of page

సింగపూర్ లష్కర్ బోనాలలో పాల్గొన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ B. వినోద్ కుమార్ గార్ల ను సింగపూర్ పర్యటనలో తెలంగాణ సింగపూరు కల్చరల్ సొసైటీ ప్రతినిదులు మర్యాద పూర్వకంగా కలసి సింగపూరు లో నిర్వహించనున్న లష్కర్ బోనాలకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధి కోసం తెలంగాణ నుండి ఇతర దేశాలకు వలస వచ్చినా తమ సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తున్న సింగపూర్ లోని తెలంగాణ ప్రజలను, అందుకు కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు కల్చరల్ సొసైటీ ప్రతినిధులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గార్ల నేతృత్వంలో ఐటి, పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి గర్వపడుతున్నామని సింగపూరు కల్చరల్ అసోసియేషన్ ప్రతినిదులు ఆనందం వ్యక్తం చేశారు. సింగపూర్ లోని తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్న లష్కర్ బోనాలకు వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నుండి కళాకారులను పంపిస్తామని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ “తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు ఖండాలు దాటిన తమ సంస్కృతిని ఆచార వ్యవహారాలను కొనసాగించడాన్ని స్వాగతించారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలు తమ సాంస్కృతి , సాంప్రదాయాలను స్వేచ్ఛగా జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు”

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page