top of page

'అలాంటివి చేయాల్సి వస్తే సినిమాల నుంచి తప్పుకుంటా..': శ్రీలీల

టాలీవుడ్ అగ్రకథానాయికల్లో శ్రీలీల ఒకరు. చేతి నిండా ప్రాజెక్టులతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

చేతినిండా సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల. ఈమె చేపట్టినా ప్రతి ప్రాజెక్టు హిట్ అవుతుండటంతో మేకర్స్ అందరూ ఈ బ్యూటీనే కథానాయికగా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి. పెళ్లిసందడి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ అమ్మడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. ఇంకోవైపు నటసింహం బాలకృష్ట మూవీలో కీలకపాత్రలో నటిస్తోంది. ఈ మూవీ రీసెంట్ గా భగవంత్ కేసరి అనే టైటిల్ పెట్టారు. మిగతా సినిమాల విషయానికొస్తే.. మెగా హీరో వైష్ణవ్ తోపాటు ఎనర్జీటిక్ స్టార్ రామ్ తోకూడా ఓ సినిమా చేస్తుంది. గౌతమ్ తిన్ననూరి-విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఈమె హీరోయిన్. నితిన్-వక్కాంతం వంశీ సినిమాతోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇటీవల ఈ బ్యూటీ దగ్గరకు ఓ ప్రాజెక్ట్ వెళ్లిందంట. బోల్డ్ కంటెంట్ మూవీ కావడంతో దానిని చేయనని నిర్మొహమాటంగా చెప్పిందట. ''ఎంత పారితోషికం ఇచ్చినా అలాంటి సినిమాలు చేయనని.. హద్దులు దాటాల్సి వస్తే మూవీస్ నుంచి తప్పుకుంటానని.. తన వైద్య వృత్తిని కొనసాగిస్తాని'' తెగేసి చెప్పిందట ఈ అమ్మడు. తాజాగా ఈ న్యూస్ ఫిలిం సర్కిల్ లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Comentarios

No se pudieron cargar los comentarios
Parece que hubo un problema técnico. Intenta volver a conectarte o actualiza la página.

మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page