top of page

మహేష్, పవన్, దేవరకొండ సహా ఏడుగురు హీరోల సినిమాలు లైన్లో పెట్టిన శ్రీలీల..

చేసిన రెండు సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న శ్రీలీల ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతోంది, ఆమె ఏకంగా 7 సినిమాలను లైన్లో పెట్టినట్టు చెబుతున్నారు.


Sree leela 7 Movies as Heroine : తెలుగమ్మాయి అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది శ్రీ లీల. కన్నడలో కొన్ని సినిమాలు చేసిన ఆమె తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమాని గౌరీ రోనంకి తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా దక్కించుకున్న సూపర్ క్రేజ్ తో శ్రీ లీల వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.ఈ సినిమా తర్వాత శ్రీ లీల ఇప్పటికే ధమాకా సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె ఏకంగా ఏడు సినిమాలు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈరోజు ఆమె విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా ఓపెనింగ్ జరిగిన నేపద్యంలో మొత్తం ఏడు సినిమాల లిస్ట్ ఏమిటి? ఏ ఏ హీరోతో ఆమె నటిస్తోంది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. విజయ్ దేవరకొండ 12వ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది.మరోపక్క నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది హీరోయిన్ పాత్ర కాకపోయినా బాలకృష్ణ కుమార్తె పాత్ర అనే ప్రచారం అయితే ముందు నుంచి జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page