top of page
Suresh D

లైంగిక వేధింపుల కేసులో 79 ఏళ్ల స్క్విడ్ గేమ్ నటుడు 🕵️‍♂️

స్క్విడ్‌ గేమ్‌ ఈ వెబ్ సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఒక ఊపుఊపేసింది. ఎక్కడ చూసిన ఇదే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నారు.

ఏకంగా ఈ వెబ్ సిరీస్ 91 దేశాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ఈ రికార్డ్ కంటిన్యూ అవుతుంది . ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటుడు ఇప్పుడు జైలు పాలు అయ్యాడు. లైగింక వేధింపుల కేసు అతడికి జైలు శిక్ష విధించారు.స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించిన ‘ఓ యోంగ్ సు’ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఆయన పై 2017లో ఈ అభియోగాలు వచ్చాయి. కాగా ఇప్పటి ఈ కేసు పై తీర్పు ఇచ్చింది దక్షిణ కొరియా కోర్టు. ఈ 79 ఏళ్ల నటుడికి జైలు శిక్ష విధించింది దక్షిణ కొరియా కోర్టు . 2017లో మనోడు ఓ మహిళ ను లైంగికంగా వేధించాడు. గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన ఈ వృద్ధుడు. అక్కడ ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే కేవలం సరస్సును దాటేందుకు ఆమె చేయి పట్టుకున్నా అని తెలిపాడు ఓ యోంగ్ సు కానీ అతను ఆ మహిళను వేధించినట్టు సాక్షాధారాలు లభించడంతో కోర్టు జైలు శిక్ష విధించింది.

bottom of page