top of page
Shiva YT

నైరుతి వచ్చేసింది.. ఇక ఎండలు లేనట్టే !!

మండు వేసవికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా.... మాడు పగిలే ఎండల నుంచి ఉపశమనం కల్గినట్టేనా... రోహిణి కార్తె మొదలయ్యింది... రోళ్లు పగిలే ఎండలనుకుంటున్న తెలగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది.


మండు వేసవికి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా…. మాడు పగిలే ఎండల నుంచి ఉపశమనం కల్గినట్టేనా… రోహిణి కార్తె మొదలయ్యింది… రోళ్లు పగిలే ఎండలనుకుంటున్న తెలగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. ఆలస్యమవుతాయనుకున్న నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే తీరాన్ని తాకాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడిచింది. జూన్ 2-3 తేదీలలో కేరళ తీరాన్ని తాకనున్నాయన్న శుభవార్తను తెలిపింది. కేరళ వరకు వచ్చాయంటే…అక్కడకి మహా అయితే మరో నాలుగైదు రోజులు అంతే.. అంటే జూన్ 7-8 తేదీల నాటికి తెలంగాణ మొత్తం చల్లబడిపోనుంది. జూన్ 10 నాటికి రాష్ట్రమంతా తొలకరి చినుకులతో పులకరించనుందన్నది వాతావరణ శాఖ తాజా కబురు.



bottom of page