రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో టీమ్ ఇండియా స్కోరు 4 వికెట్లకు 153 పరుగులు చేసింది.
రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో టీమ్ ఇండియా స్కోరు 4 వికెట్లకు 153 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత భారత జట్టు 11 బంతుల్లోనే ఎలాంటి పరుగులు చేయకుండానే మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. అయితే భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇండియా నుంచి ఒక్క ఫిఫ్టీ కూడా రాలేదు. విరాట్ కోహ్లీ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. వీరితో పాటు రోహిత్ శర్మ 39, శుభ్‌మన్ గిల్ 36, కేఎల్ రాహుల్ 8 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన ఏడుగురు బ్యాట్స్‌మెన్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. వీరిలో యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ ఉన్నారు.
11 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయిన భారత్..
భారత్ పరుగులేమీ చేయకుండానే చివరి 6 వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 153 వద్ద 4 వికెట్లు కోల్పోయి.. ఓ దశలో చాలా బలంగా కనిపించిన భారత జట్టు.. అదే స్కోరు వద్ద ఆలౌట్ కావడం గమనార్హం. 33వ ఓవర్ తొలి, మూడు, ఐదో బంతుల్లోనే భారత జట్టు వికెట్లు కోల్పోయింది. 34వ ఓవర్లో కూడా భారత్ మొదటి, మూడు, ఐదో బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయింది.లుంగీ ఎన్‌గిడి 33వ ఓవర్‌లో 3 వికెట్లు తీయగా, కగిసో రబాడ 34వ ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.🏏