top of page
MediaFx

సోనియాకు కూడా బెయిల్‌ వచ్చింది.. అంటే బీజేపీతో కాంగ్రెస్‌కు పొత్తు ఉన్నట్లేనా? కేటీఆర్‌ కౌంటర్‌


బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఇచ్చారని కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు ముందు ఈ విషయాలను తమ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. – ఈడీ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఇద్దరూ కూడా 2015 డిసెంబర్‌లో బెయిల్‌ పొందారు.– ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చేరింది. ఆ పార్టీ నాయకుడు మనీశ్‌ సిసోడియా వారం కిందట బెయిల్‌కొచ్చారు.– తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో 2015 నుంచి బెయిల్‌ మీదే తిరుగుతున్నారు.

ఇవన్నీ కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే జరిగాయని కేటీఆర్‌ అన్నారు. పై అంశాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలు కూడా పార్టనర్స్‌ అని అనుకోవచ్చా? అని ప్రశ్నించారు.

మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్‌ మంజూరు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధికారంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్‌ చేసిన బండి సంజయ్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విజయమంటూ బండి సంజయ్‌ చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ ఖండించారు. కాంగ్రెస్‌ లాయర్‌ చేసిన కృషితో ఒకరికి బెయిల్‌ వస్తే, బీఆర్‌ఎస్‌ మద్దతు కారణంగా ఆ న్యాయవాది రాజ్యసభలో స్థానం పొందారంటూ సంజయ్‌ వివాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కేటీఆర్‌ ఉటంకించారు. వైన్‌ అండ్‌ డైన్‌ క్రైమ్‌లో పార్టనర్స్‌ అయిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు కంగ్రాట్యులేషన్స్‌ అంటూ బండి సంజయ్‌ తన స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉంటూ చౌకబారుగా మాట్లాడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.


bottom of page