ప్రయాణ సమయాన్ని ఆదాచేసే వాహనాల్లో విమానం మొట్టమొదటిది. చాలా తక్కువ సమయంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి విమానంలో చేరుకోవచ్చు. అయితే విమాన ప్రయాణం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. టైమ్ సేవ్ అవుతుంది కాబట్టి..
ప్రయాణ సమయాన్ని ఆదాచేసే వాహనాల్లో విమానం మొట్టమొదటిది. చాలా తక్కువ సమయంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి విమానంలో చేరుకోవచ్చు. అయితే విమాన ప్రయాణం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. టైమ్ సేవ్ అవుతుంది కాబట్టి.. చాలామంది విమాన ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడానికి విమాన ప్రయాణం కంపల్సరీ. ఐతే.. మరీ ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తే సమయం కూడా ఎక్కువే పడుతుంది కనుక, ఈ ప్రయాణాన్ని సరదాగా చేయడానికి కొన్ని విమానయాన సంస్థలు రకరకాల ఆప్షన్స్‌ను అనుసరిస్తున్నాయి. విమానయాన సంస్థలు ప్రయాణికులకు కొత్త కొత్త సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా వియట్ జెట్ ఏవియేషన్ బికినీ ధరించిన మహిళలను విమాన ఎయిర్‌హోస్టెస్‌లుగా తీసుకురావడానికి కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. వియట్ జెట్ ఏవియేషన్ CEO అయిన గ్యుయెన్ థి ఫుఓంగ్ థావ్ (Nguyen Thi Phuong Thao) ఈ ప్లాన్ చేవేశారు. ఫోర్బ్స్ ప్రకారం, ఈ వర్ధమాన బిలియనీర్… హవాయి డ్యాన్స్ చేస్తూ… బికినీలో మాత్రమే పనిచేసే మహిళలు తన స్వదేశీ విమానయాన సంస్థలో పనిచేస్తే బాగుంటుందని భావించారు.