మన సమాజంలో ప్రేమ పేరుతో హింస కొత్తేమీ కాదు. ఒక మహిళ ప్రేమను ఒప్పుకోలేదని గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో దారుణమైన ఉన్మాదానికి ఒడిగట్టాడు.
ఒకటి రెండు సందర్భాలలో గణేష్ బాధితురాలినకి ప్రపోజ్ చేశాడు. అయితే ఆమె అతని ప్రతిపాదనను ఒప్పుకోలేదు . ఇది గణేష్‌కి కోపం తెప్పించింది, ఆమె మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉందని భావించి, ప్లాంట్ కట్టర్‌తో ఆమెపై దాడి చేసాడు. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న బాధితురాలు ఎపిలోని పల్నాడు జిల్లాకు చెందిన మహిళ, తన బంధువైన కొత్త గణేష్ (27)తో ఆమెకు పరిచయం ఉంది. “రెండు సందర్భాలలో ఆ వ్యక్తి బాధితురాలిని ప్రపోజ్ చేశాడు. అయితే ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించింది ఇది గణేష్‌కు కోపం తెప్పించింది, ఆమె మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉందని భావించి, ఆమెపై దాడి చేసింది, ”అని నార్సింగ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఓ హోటల్‌లో చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు, గణేష్ పై కేసు బుక్ చేసారు.