top of page

ఆమె నవ్వితే ప్రపంచమే ఫిదా అయిపోతుంది..

తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా..తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. పలు చిత్రాల్లో సహాయ నటిగా కనిపిస్తూ మెప్పిస్తుంది.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న త్రోబ్యాక్ పిక్చర్స్‏లో తాజాగా మరో కొత్త ఫోటో చేరింది. ఆమె నవ్వితే ప్రపంచమే ఫిదా అయిపోతుంది.. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్.. సంప్రదాయానికి పట్టుచీర కట్టినట్లుగా ఉంటుంది ఆమెను చూస్తే. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా..తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. పలు చిత్రాల్లో సహాయ నటిగా కనిపిస్తూ మెప్పిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. అందం, అభినయం ఆమె సొంతం. గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ స్నేహ.

స్నేహ 2000 సంవత్సరంలో ఇంగనే ఒరు నీలాబక్షి అనే మలయాళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళంలో మాధవన్ సరసన ఎన్నవలే అనే చిత్రంలో నటించింది. తర్వాత ఆనందం, పార్థలే పరవాసం, పమ్మల్ కే సమ్మంతం, సామి దేశం, ఉనే నిధి, ఇన్ ఏప్రిల్, వసీకరా, జానా, వసూల్‌రాజా వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో గోపిచంద్ నటించిన తొలివలపు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తరుణ్ సరసన ప్రియమైన నీకు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో శ్రీరామదాసు, మహారథి, మధుమాసం, రాధాగోపాలం, సంక్రాంతి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 2012లో తమిళ్ హీరో ప్రసన్నను వివాహం చేసుకున్న స్నేహ ఆ తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే స్నేహ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page