top of page

📺 స్మార్ట్ TV: రూ. 44 వేలకే 65 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ సొంతం చేసుకునే అవకాశం..

🇺🇸 అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ వెస్టింగ్‌ హౌజ్‌ కంపెనీ భారత మార్కెట్‌లోకి కొత్త టీవీని లాంచ్‌ చేసింది. 'WH65GTX50' పేరుతో ఈ టీవీని తీసుకొచ్చారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

📅 ఇదిలా ఉంటే అక్టోబర్‌ 7 నుంచి ఈ స్మార్ట్‌ టీవీ అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ టీవీ రూ. 43,999 కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందిచారు. 3840 x 2160 పిక్సెల్‌తో కూడిన డిస్‌ప్లే ఈ స్మార్ట్ టీవీ సొంతం. ఇక 60 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక స్టోరేజ్‌ విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలో 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ను అందిచనున్నారు. ఈ స్మార్ట్ టీవీ గూగుల్‌ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇక ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌, జీ5 వంటి యాప్స్‌కు ఇన్‌బుల్ట్‌గా ఇవ్వనున్నారు.

🔌 కనెక్టివిటీ ఫీచర్స్‌ విషయానికొస్తే.. ఇందులో 3 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్టులు, ఏఎల్‌ఎల్‌ఎమ్‌, ఈఏర్‌సీ, బ్లూటూత్‌ 5.0, ఈథర్‌నెట్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందిచారు. ఈ స్మార్ట్ టీవీని కాంట్రాస్ట్ సూపర్‌ టెక్నాలజీ డిస్‌ప్లేతో రూపొందించారు. దీంతో అత్యంత నాణ్యమైన పిక్చర్‌ క్వాలిటీని అందించనున్నారు. ఇదిలా ఉంటే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ టీవీపై కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంకులకు సంబంధించిన కార్డులతో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్‌ లభించనుంది. 📺🤩🌟💰

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page