ఈ మూవీ విడుదలైన దగ్గరినుంచి కేవలం 8 రోజుల్లోనే రూ.10 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. మరోవైపు ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ వలన థియేటర్‌ల సంఖ్య కూడా పెంచినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటాడు కార్తీక్ (నార్నె నితిన్). కరోనా వలన లాక్ డౌన్ రావడంతో తన సోంతఊరు అయిన అమలాపురం వస్తాడు. అయితే అమలాపురంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటునే తన చిన్ననాటి ఫ్రెండ్స్ అయిన హరి(అంకిత్ కోయ), సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి)తో కలిసి సరదాగా గడుపుతుంటాడు. అయితే అదే ఊరిలో ఉన్న పల్లవి (నయన్ సారిక)ని చూసి ఫస్ట్ లుక్‌లోనే ఇష్టం పెంచుకుంటాడు. అయితే ఊరులో ఉండే పల్లవికి సోషల్ మీడియాలో చలాకీగా ఉండడంతో పాటు కులం పట్టింపులు ఎక్కువ. అయితే కార్తీక్ తన కులం వాడే అనుకుని లవ్ చేస్తుంది. అయితే కార్తీక్ కులం వేరని తెలిసిన పల్లవి తన తండ్రి (మైమ్ గోపి) అతడిని చంపేస్తాడని దూరం పెడుతుంది. ఈ క్రమంలో కార్తీక్ ఏం చేస్తాడు. పల్లవి, కార్తీక్‌ల ప్రేమను పల్లవి తండ్రి ఒప్పుకుంటాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.