top of page
MediaFx

స్లో రన్నింగ్ తో 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 🏃‍♂️

శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రన్నింగ్(Running)మేలు చేస్తుంది. చాలా మంది ఉదయం నిద్ర లేచిన తర్వాత పరుగెత్తడానికి ఇష్టపడతారు. ఫిట్‌నెస్ ప్రపంచంలో స్లో రన్నింగ్ తక్కువగా అంచనా వేయబడుతుంది, కానీ స్లో రన్నింగ్ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నెమ్మదిగా పరుగెత్తడం వల్ల మీ గుండె ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. నెమ్మదిగా పరుగెత్తడం వల్ల మీ గుండె, మెదడు ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఊబకాయం నుండి బయటపడవచ్చు. దాని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుంటే, మీరు ఈ రోజు నుండే నెమ్మదిగా పరుగెత్తడం ప్రారంభిస్తారు. 

ఓ నివేదిక ప్రకారం.. స్లో రన్నింగ్ మీకు శారీరకంగా, మానసికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. నెమ్మదిగా పరిగెత్తడం ద్వారా కేలరీలను సులభంగా బర్న్ చేయవచ్చు, ఇది గాయం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. విశేషమేమిటంటే, మీరు ఎక్కువసేపు స్లో రన్ చేయగలరు.. ఎక్కువ దూరం ప్రయాణించగలరు. స్లో రన్నింగ్ గుండే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. రెగ్యులర్ స్లో రన్నింగ్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యవంతులు తమ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్లో రన్నింగ్ చేయాలి. గుండె జబ్బులు ఉన్న రోగులు నెమ్మదిగా రన్నింగ్ చేసే ముందు డాక్టర్ ని సంప్రదించాలి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, నెమ్మదిగా పరుగెత్తడం వల్ల అధిక కొలెస్ట్రాల్,డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. స్లో రన్నింగ్ రక్తపోటు రోగులకు అత్యంత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. హైబీపీ ఉన్నవాళ్లు రోజూ స్లో పేస్‌తో నడుస్తుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. స్లో రన్నింగ్ అనేది ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహజమైన మార్గం. ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారికి స్లో రన్నింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నెమ్మదిగా పరుగెత్తడం వల్ల కండరాలు, కీళ్లపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా గాయం ప్రమాదం తగ్గుతుంది. స్లో రన్నింగ్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే, ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు అలా చేయడానికి ముందు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

bottom of page