top of page
MediaFx

దుస్తులు లేకుండా నిద్రపోతే.. ఇన్ని లాభాలున్నాయా.?


తిండి, నిద్ర ఈ రెండూ మనిషికి ఎంతో ముఖ్యమైనవి. మంచి, ఆహారం నిద్ర ఉంటే చాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరికిచేరవని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు.

ఇక రాత్రుళ్లు పడుకునే సమయంలో చాలా మంది నైట్‌ వియర్‌లు ధరిస్తుంటారు. కొందరైతే రోజంతా ఏ డ్రస్‌లో ఉన్నారో అదే డ్రస్‌లో పడుకుంటారు. అయితే రాత్రుళ్లు అసలు దుస్తులు లేకుండా పడుకుంటే ఏమవుతుందో తెలుసా.? ఇదేం ఆలోచన అంటారు కదూ! అయితే రాత్రుళ్లు దుస్తులు లేకుండా పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయిని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రిపూట దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా పడుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుందని చెబుతున్నారు.

* ఇక బరువు తగ్గడంలో కూడా రాత్రి దుస్తులు లేకుండా పడుకోవడం ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.దీంతో బరువు తగ్గుతారని అంటున్నారు.

* దుస్తులు లేకుండా శరీరం రిలాక్స్‌గా ఉంటుంది.ఈ కారణంగా శరీరంలో సంతోషాన్ని పెంచే హార్మోన్లు విడుదల అవుతాయి. దీనివల్ల ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలు దూరమవుతాయని అంటున్నారు.

* అన్నిటికంటే ముఖ్యంగా దుస్తులు లేకుండా పడుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా ఉన్న అలసట దూరమై ఇట్టే నిద్ర పడుతుంది.

* రాత్రుళ్లు దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. మొత్తం శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగా ఉంటుంది. దీంతో పాటు హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్య కూడా దూరమవుతుంది.

* వీటితో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవని చెబుతున్నారు. శరీరానికి తగినంత గాలి ఆడితే అలర్జీలు వంటివి రావని నిపుణులు చెబుతున్నారు.


bottom of page