top of page
MediaFx

నిద్రలేమి సమస్య తీవ్రంగా వేధిస్తున్నదా.. ఈ చిట్కాలతో చక్కగా నిద్రపోండి..


మంచి నిద్రకు చిట్కాలు..అశ్వగంధ చూర్ణం

అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దానివల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ సహజంగా ట్రై ఎథిలిన్ గ్లైకాల్‌ను కలిగి ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. మంచి నిద్ర కోసం మీరు పడుకోవడానికి 30 నిమిషాలు ముందు అశ్వగంధను తీసుకోవచ్చు.

బాదాం జ్యూస్

బాదాంలో ఫైబర్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాదాంలో మెగ్నీషియం ఉంటుంది. నిద్ర సహాయక కారకం అయిన మెలటోనిన్ నియంత్రణకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం మీ కండరాలను కూడా సడలింపజేస్తుంది. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.

జాజికాయ పాలు

ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తీసుకోవడంవల్ల నిద్ర మెరుగుపడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండూ మంచి నిద్రకు తోడ్పడుతాయి.

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలను పెపిటాస్ అని కూడా అంటారు. వీటిలో ట్రిప్టోఫాన్‌తోపాటు జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ సెరటోనిన్‌ను నిర్మించడంలో సహాయపడతాయి. సెరటోనిన్‌ నిద్రను మెరుగుపరుస్తుంది.

Related Posts

See All

యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!

కృష్ణ భక్తితో మనసులు ఉప్పొంగిపోతున్న క్షణాలివి. యుగాలు మారినా..తరాలు మారినా.. కృష్ణ తత్వం ప్రపంచానికి దారి చూపుతూనే ఉంది.

bottom of page