top of page
MediaFx

ఎండాకాలంలో శృంగార కోరికలు పెరగడానికి కారణాలివే..


కోరికలు కలగడం, శృంగారం చేయాలనుకోవడం.. రెండూ కూడా ఆరోగ్యకరమైన శరీర లక్షణమే. అయితే, ఎండాకాలంలో ఈ కోరికలు మరింతగా పెరుగుతాయి.  కారణాలు ఏంటో తెలుసుకుందాం.

సూర్యరశ్మి..ఎండలో సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సెరోటోనిన్ పెరుగుతుంది. ఇది మంచి హార్మోన్. ఇది మానసిక స్థితిని మెరుగ్గా చేసి వేడి వాతావరణం, రక్తప్రసరణ పెరుగుదలకి కారణమవుతుంది. ఇవి లైంగిక ఉద్రేకాన్ని పెంచుతాయి. దీని వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అయి కోరికలు పెరుగుతాయి.

చెమట ఎక్కువగా పోవడం వల్ల..వర్కౌట్ చేసిన వారికి ఎక్కువగా శృంగార కోరికలు ఉంటాయి. దీనికి కారణం చెమట బయటికి రావడం. దీని వల్ల స్త్రీ, పురుషుల్లో మానసిక స్తితి మెరుగ్గా మారి ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు, ఆకర్షణ పెరిగి లైంగిక కోరికలు పెరుగుతాయి.

విటమిన్ డి కారణంగా..సూర్యరశ్మికి ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. ఇవి మగవారు, ఆడవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. టెస్టోస్టెరాన్ అనేది లైంగిక జీవితానికి సంబంధించిన హార్మోన్. దీని కారణంగా విటమిన్ డి 20 నుంచి 40 సంవత్సరాల వయసు గల మహిళల స్థితిని మెరుగ్గా చేస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం.

నిద్రలేమి..ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రలేమి ఉంటుంది. ఈ నిద్ర లేకపోవడం వల్ల ఆకర్షణ పెరిగి శృంగార కోరికలు పెరుగుతాయి. వీటితో పాటు ఎక్కువగా వర్కౌట్ చేసినా, నడిచినా కూడా ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. ఎండార్ఫిన్స్, డోపమైన్, సెరోటోనిన్ మొదలైనవాటిని పెంచి కోరికల్ని పెంచుతాయి.

Comments


bottom of page