రాజు గారి కోడి పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:
బాస్మతీ బియ్యం, చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, పులావ్ దినుసులు, పుదీనా, కొత్తిమీర కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, నెయ్యి, ఆయిల్, నిమ్మరసం, జీడిపప్పు, పెరుగు.
రాజు గారి కోడి పులావ్ తయారీ విధానం:
ముందుగా బాస్మతీ రైస్‌కి శుభ్రంగా కడిగి ఓ గంట సేపు నాన బెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో.. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ముందు జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ నెక్ట్స్ ఉల్లిపాయలను కూడా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టాలి. ఇవి చల్లారాక మిక్సీలో ఉల్లిపాయలు, జీడిపప్పు, కొద్దిగా పెరుగు వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత చికెన్‌లో గరం మసాలా, ఉప్పు, నిమ్మ రసం ఉల్లి పెరుగు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి ఓ గంటసేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కావాలంటే కొద్దిగా నెయ్యి వేసి.. పులావ్ దినుసులు అన్నీ వేసి వేయించాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించండి. ఇవి వేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాక.. మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి ఓ పది నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేయాలి. ఆ నెక్ట్స్ టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ చక్కగా వేగాక.. నానబెట్టిన బియ్యం కూడా వేసి ఒకసారి కలిపి సరిపడా నీళ్లు వేసి.. కుక్కర్ మూత పెట్టి.. రెండు విజిల్స్ మాత్రమే తెప్పించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాజు గారి కోడి పులావ్ సిద్ధం. ఇంకెందుకు లేట్ లొట్టలేసుకుంటూ తినేయండి.