top of page

‘సీతారామం’ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ కొత్త సినిమా షురూ..


‘స‌లార్’, ‘క‌ల్కి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో జోష్ మీదున్న ప్ర‌భాస్ తాజాగా మ‌రో సినిమాను ప్రారంభించాడు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. ‘ఫౌజీ’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఈ వేడుక‌కు ప్ర‌భాస్‌తో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి వ‌చ్చి సంద‌డి చేశారు. కాగా.. ఈరోజు సాయంత్రం ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్ ఎస్మాయిల్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ అనుకుంటునట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్‌ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండ‌గా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్‌ కనిపించనున్నారట. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page