🔸 సిరిసిల్ల టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు బీజేపీ నేతలు పోటీ పడ్డారు. 🔸 అయితే.. స్థానికులకు కాకుండా రాణిరుద్రమకు టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. 🔸
దీంతో స్థానిక నేతలందరూ మూకుమ్మడిగా అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 🔸 టికెట్ ఆశించిన.. లగిశెట్టి శ్రీనివాస్. 🔸 రమకాంత్, అన్నలదాసు వేణు, బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 🔸 రమాకాంత్, కేటిఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిపోయారు. 🔸 అదే విధంగా… మిగతా నేతలు పార్టీలో ఉన్నా సైలెంట్ అయ్యారు.
🗳️ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ సిరిసిల్ల నియోజకవర్గంలో అసంతృప్తులు ఏమాత్రం చల్లారడం లేదు. 🔸 ఇక్కడంతా జరుగుతున్నా, అధిష్టానం మాత్రం జోక్యం చేసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 🔸 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే.. అనేక కేసులు పెట్టారని, ఇప్పుడు కొత్త వారికి టికెట్ ఎలా ఇస్తారని.. అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. 🔸 ఇక పార్టీలో ఉన్న నేతలు సైతం ప్రచారంలో కలిసిరావడం లేదు. 🔸 దీంతో… బీజేపీ ముఖ్య నేతలకు ఇబ్బందిగా మారింది. 🔸 కొంత మంది నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను కలిసి తమ బాధను విన్నవించారు. 🔸 అయినప్పటికీ.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. 🔸 అందరిని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అసమ్మతి నేతలు మాత్రం ఎవరికైనా, స్థానికుడికి మాత్రమే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. పార్టీలో ఉండలేమని.. తేల్చి చెబుతున్నారు.