top of page

రాత్రి భోజనం చేయడం మానేస్తే ఏమవుతుందో తెలుసా..?

బరువు తగ్గాలనుకునే వారు చేసే మొదటి పని రాత్రిపూట భోజనం మానేయడం. రాత్రిపూట ఎక్కువగా తినడం వల్లే బరువు పెరుగుతారని నిపుణులు సైతం చెబుతుంటారు.

అయితే డైటింగ్ పేరుతో రాత్రిపూట భోజనం మానేస్తే ఆరోగ్యానికి చాలా ప్రమాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రిపూట భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట పూర్తిగా ఆహారం మానేయడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేయకుండా నిద్రపోతే ఇన్సులిన్‌ స్థాయిలు క్షణిస్తానయి చెబుతున్నారు. దీనివల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే రాత్రిపూట ఆహారం తీసుకోకపోతే గ్యాస్‌ లేదా ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే అల్సర్‌, అసిడిటీ వంటి సమస్యలకు కూడా దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రుళ్లు తక్కువ ఆహారం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ పూర్తిగా మానేయడం మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గుండెలో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

bottom of page