top of page

టిల్లు క్యూబ్‌‌ కథ చెప్పేసిన సిద్ధూ..🎥✨

టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ గా టిల్లు స్క్వేర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి దానితో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు.

ఇదివరకు రిలీజ్ అయిన డీజే టిల్లు ని మించి మరింతగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. టిల్లు గా సిద్దు సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడు మల్లిక్ రామ్ టేకింగ్ ఈ మూవీ ప్లస్ అయ్యాయని అంటున్నారు ఆడియన్స్. విషయం ఏమిటంటే, దీనికి సీక్వెల్ గా త్వరలో టిల్లు క్యూబ్ మూవీ కోసం ఒక పాయింట్ ఆలోచన చేస్తున్నాం అంటూ ఇటీవల నిర్మాత నాగవంశీ తెలిపారు.ఇక తాజాగా దానికి సంబంధించి హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, టిల్లు గాడు సూపర్ హీరో అయితే ఎలా బిహేవ్ చేస్తాడో, ఎలా ఉంటాడో అనే దాని మీద సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. త్వరలో దానికి సంబంధించి పూర్తి స్టోరీ, స్క్రిప్ట్ డెవలప్ చేసిన అనంతరం చెప్తాను అని అన్నారు. ఇకపై టిల్లు క్యారెక్టర్ ని ఆడియన్స్ ముందుకి పలు పార్ట్స్ ద్వారా తీసుకెళ్లాలనేది తమ ఆలోచన అని ఆయన తెలిపారు.🎥✨

bottom of page