top of page

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రేజీ ఎంటర్టైనర్ “టిల్లు స్క్వేర్”🎥🍿


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నేహా శెట్టి అలాగే ప్రియాంక జవల్కర్ లు ఇంట్రెస్టింగ్ కామియో లో దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “టిల్లు స్క్వేర్”. మరి ఇది సిద్ధూ కెరీర్ లోనే భారీ వసూళ్ళని అందుకోగా ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా స్టార్ హీరోస్ రేంజ్ లో వసూళ్లు సాధించింది. మరి ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమా హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇందులో ఈ క్రేజీ రైడ్ చిత్రం పాన్ ఇండియా భాషల్లో అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు తప్పకుండా నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి అచ్చు, రామ్ మిర్యాల, భీమ్స్ లు సంగీతం అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.


bottom of page