top of page
Suresh D

ఈ చిన్నారి సంగీత ప్రపంచానికి మెలోడీ క్వీన్..! 💞🎵

తెలుగుతోపాటు హిందీ, తమిళంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో దాదాపు 300లకు పైగా పాటలు పాడింది.

తెలుగుతోపాటు హిందీ, తమిళంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో దాదాపు 300లకు పైగా పాటలు పాడింది. తన గాత్రంతో ప్రేమను.. విరహాన్ని.. దుఃఖాన్ని శ్రోతల మనసులలో భావాలను తెలియజేస్తుంది. నవ్విస్తుంది.. ప్రేమిస్తుంది.. కన్నీళ్లు పెట్టిస్తుంది ఆమె గాత్రం. భాషతో సంబంధం లేకుండానే అన్ని ఇండస్ట్రీలో వందలాది పాటలు పాడి శ్రోతల మనసులను తట్టిలేపుతుంది. ఆమె గాత్రానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. “నువ్వే నా శ్వాసా.. మనసున నీకై అభిలాషా.. బ్రతుకైన నీతోనే.. చితికైనా నీతోనే.. వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్న ఆశా” అంటూ ప్రేమికుడి కోసం వెతికే అమ్మాయి తపనను తెలియజేస్తుంది. అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అంటూ అమ్మాయి అల్లరిని చెప్పేస్తుంది. మ్యూజిక్ వరల్డ్ ఆమెను మెలోడీ క్వీన్ అని పిలుచుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టరా ?.. తనే సింగర్ శ్రేయా ఘోషల్. ఈరోజు ఆమె పుట్టినరోజు.

రెండు దశాబ్దాల పాటు తన పాటలో శ్రోతలను మంత్రముగ్దులను చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హృదయాలను హత్తుకుంటున్న మధురమైన గాత్రంతో.. సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. మార్చి 12న 1984లో పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో జన్మించింది. ఆమె తల్లి సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. నాలుగేళ్ల వయసు నుంచే శ్రేయా ఘోషల్ నత తల్లివద్దనే సంగీతం నేర్చుకుంది. చిన్న వయసులోనే హర్మోనియం నేర్చుకుంది. 12 ఏల్ల వయసులో హిందీలో సరిగమప షోలో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పటివరకు 20కు పైగా భాషల్లో 2400 పైగా పాటలు పాడింది.

తెలుగులో ఆమె పాడిన మొదటి పాట నువ్వేం మాయ చేశావో గానీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు, భూమిక జంటగా నటించిన ఒక్కడు సినిమాలోనిది. ఆ తర్వాత తెలుగులో అనేక పాటలు పాడింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషలలో ఆమె పాటలకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. యూఎస్ఏలోని ఓహియోలో శ్రేయా ఘోషల్ గౌరవార్థం ప్రతి సంవత్సరం శ్రేయ డే జరుపుకుంటారు. ప్రతి ఏడాది జూన్ 25న ఓహియోలో శ్రేయ డేను జరుపుకుంటారు. లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో శ్రేయా మైనపు విగ్రహం ఉంది. 2015లో తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.💞🎵

bottom of page