top of page
MediaFx

మోదీతో రిలేషన్‌లో ఉన్న హీరోయిన్..?💖


బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రద్దా కపూర్ టీన్ పట్టి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయింది. అయితే ఆషికీ-2 సినిమాతోనే శ్రద్దా కపూర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో శ్రద్దా కపూర్ నటనకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. శ్రద్దా కపూర్ డ్యాన్స్‌కు సపరేటు ఫ్యాన్స్ ఉన్నారు. శ్రద్దా కపూర్ రేంజ్‌లో మరే హీరోయిన్ కూడా డ్యాన్స్ చేయలేరంటే అతిశేయోక్తి కాదు. ఇక అమ్మడుకు ఎఫైర్ల కూడా తక్కువేం కాదు. పలువురు హీరోలతో శ్రద్దా కపూర్ ప్రేమయాణం సాగించింది. ఆషికీ-2 హీరో ఆదిత్యా రాయ్ కపూర్‌తో శ్రద్దా కపూర్ కొన్నాళ్లు డేటింగ్ చేసింది. తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో ప్రేమాయణం నడిపినట్లు, త్వరలో మ్యారేజ్ కూడా జరగబోతున్నట్లు న్యూస్ హల్ చల్ చేసింది. 

కానీ అది కూడా పెళ్లిపీటల దాకా వెళ్లలేదు. ఇక ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కూడా శ్రద్దా కపూర్ ప్రేమలో ఉందనే వార్తలొచ్చాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ రచయిత రాహుల్ మోదీతో శ్రద్దా కపూర్ డేటింగ్ చేస్తుందని తెలుస్తోంది. వీరిద్దరు గాఢమైన ప్రేమలో ఉన్నారట. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ - రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కూడా ప్రియుడు రాహుల్ మోదీతో కలిసి దర్శనం ఇచ్చింది. అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు కలిసి హాజరయ్యారు. దీంతో శ్రద్ధా కపూర్ రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఇద్దరు రొమాంటిక్‌ వెకేషన్‌కు వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ బంధమైన పెళ్లి బంధంగా మారుతుందేమో చూడాలి. 

bottom of page