top of page
Shiva YT

🔍 డిస్కౌంట్‌ యాడ్స్‌ను చూసి నమ్మొద్దు..

మీరు నేరుగాసేల్ సమయంలోనే మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే అప్పుడు ధర తగ్గిందా లేదా అన్న విషయం తెలియదు. అందుకే ముందు నుంచే ట్రాక్ చేయడం బెటర్‌. ఇ-కామర్స్ సైట్‌లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు.

50 శాతం, 60 శాతం, ఒక్కోసారి 90 శాతం డిస్కౌంట్ అని యాడ్స్ కనిపిస్తాయి. స్క్రీన్‌లపై కనిపిస్తున్న డిస్కౌంట్స్ చూసి మోసపోకూడదు. మీరు కొనాలనుకునే వస్తువు ధర ఎంత ఉంటుందో మీకు ఓ ఐడియా ఉండాలి. అంతకన్నా తక్కువకే ఆ వస్తువు లభిస్తే కొనాలి. అంతే తప్ప డిస్కౌంట్స్ చూడకూడదు. మీరు ధరలను చాలాకాలంగా ట్రాక్ చేస్తూ ఉంటే సేల్ సమయంలో ఆ వస్తువు ధర తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలుస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువుల ధరలను ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి.

కొన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని ప్రోడక్ట్స్‌ అమెజాన్‌లో లభిస్తాయి. కానీ చాలావరకు ప్రొడక్ట్స్ రెండు వెబ్‌సైట్లలో లభిస్తాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలి. ఉదాహరణకు .. మీరు వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే పెద్దపెద్ద బ్రాండ్స్ ఆన్‌లైన్‌లో అమ్ముతుంటాయి. బ్రాండ్స్ వేర్వేరు అయినా ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. ఆన్‌లైన్ షాపింగ్ ఓ వ్యసనం లాంటిదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ వ్యసనంలో పడి అవసరం లేని వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు. అవసరం లేని వస్తువులు కొంటూ పోతే జీవితంలో ఏదో ఓ దశలో అవసరం ఉన్న వస్తువుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయం గుర్తించుకోవాలి.

bottom of page