top of page

ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నం..🛒📦🆕

ఈ-కామర్స్‌ రంగం రోజురోజుకీ విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్‌. చివరికి పాల ప్యాకెట్లు కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ పెట్టే రోజులు వచ్చేశాయ్‌. గ్రాసరీ ఐటెమ్స్‌ను నిమిషాల వ్యవధిలోనే అందిస్తున్నాయి. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ లాంటి సేవలను ఎలాంటి వస్తువులనైనా ఒక రోజులో అందిస్తున్నాయి.🌐📲✨

అయితే కంపెనీ మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నానికి తెర తీసింది. వస్తువులను బుక్‌ చేసిన రోజే డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌ కార్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాల్లో తొలుత ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.🌍🚚🔍

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడతో పాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, కోయంబత్తూరు, చెన్నై, దిల్లీ, గువాహటి, ఇందౌర్‌, జైపుర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, లుథియానా, ముంబయి, నాగ్‌పూర్‌, పుణె, పట్నా, రాయ్‌పుర్‌, సిలిగురి నగరాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కాలక్రమేణ ఈ సేవలను దేశమంతా విస్తరించేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా ఎలాంటి తేదీ ప్రకటించలేదు. 📅🚀📢

bottom of page