top of page
Shiva YT

ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం ఏదో తెలుసా..? 🌍💰

బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 🇺🇸 మొదటి స్థానంలో ఉంది. అమెరికా వద్ద 8133 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.

జర్మనీ 🇩🇪 రెండవ అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది. జర్మనీలో 3359 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇక, ఇటలీ 🇮🇹 మూడో స్థానంలో ఉంది. ఇటలీలో 2451.84 MT బంగారం ఉన్నది. చారిత్రాత్మకంగా, ఇటలీ రాజులు, చక్రవర్తులు తమ బంగారు ఖజానాను దోపిడీలు, దాడుల ద్వారా భారీగా పెంచుకున్నారు. ఫ్రాన్స్ 🇫🇷 నాలుగో స్థానంలో ఉంది. ఫ్రాన్స్ వద్ద 2436.35 మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నది. ఒకప్పుడు ఫ్రాన్స్ ప్రపంచం మొత్తాన్ని శాసించేది. అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో రష్యా 🇷🇺 ఐదవ స్థానంలో ఉంది. రష్యాలో 2298.53 మెట్రిక్ టన్నుల బంగారం నిల౵లు ఉన్నది. ఆరో స్థనంలో చైనా 🇨🇳 ఉంది. చైనా వద్ద 2068.36 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నది. అవసరమైన ఇతర దేశాలకు రుణాలు ఇవ్వడానికి కూడా చైనా ప్రసిద్ధి చెందింది. ఇక ఏడవ స్థానంలో స్విట్జర్లాండ్ 🇨🇭 నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాలలో ఒకటి. విదేశీయులకు అధిక జీవన వ్యయం కూడా ఉంది. ఇది జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్‌లో 1040.00 టన్నుల బంగారు నిల౵లు ఉన్నది.

జపాన్‌ 🇯🇵 తన బంగారు నిల౵లో 846 టన్నుల బంగారంతో జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. దేశం దాని పరిశుభ్రత, ప్రవర్తనకు కూడా ప్రసిద్ధి చెందింది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ దాని బంగారు నిల౵లను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్ 🇮🇳 తొమ్మిదో స్థానంలో ఉంది. భారత్‌లో 743.83 టన్నుల బంగారం నిల౵లు ఉన్నాయి. పురాతనకాలంలో బంగారపు పక్షి అని కూడా పిలువబడే భారతదేశం 🐦 ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే చరిత్రలో ఒకప్పుడు భారత్‌లో అత్యధికంగా బంగారం నిల౵లు ఉన్నదిగా గుర్తింపు ఉన్ది. 🇮🇳🌟

bottom of page