top of page

🎮 ఆన్‌లైన్ గేమ్స్: ఆడుతున్నారా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు 📝

గేమింగ్-జూదం రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. 🎰 జూదం అంటే గ్యాంబ్లింగ్ అనేది అదృష్టం పై ఆధారపడి ఆడే పందెం ఉదాహరణకు రమ్మీ వంటివి. 🎲 మరోవైపు గేమింగ్ అంటే చెస్ లాంటి స్కిల్స్ తో ఆడే ఆటలు. ఇవి మానసిక సామర్ధ్యాలపై ఆధారపడి ఉంటాయి. 🧠

ఈ రెండు రకాలకూ నిర్వచనంతో పాటు కొన్ని నియమాలూ ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఐటీ చట్టం-2021 సవరణ ప్రకారం.. అవకాశం అంటే అదృష్టం ఆధారంగా ఉన్న అన్ని ఆటలను ప్రభుత్వం జూదంగా పరిగణిస్తుంది. ఇటువంటి అన్ని ఆటలను ప్రభుత్వం దశలవారీగా గుర్తించి క్లోజ్ చేస్తుంది.

ఇప్పుడు ఇటువంటి ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడవారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పటివరకూ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు వినియోగదారు రూ.10 కమీషన్ చెల్లించాలి. 📈 ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా వినియోగదారు రూ.100 సంపాదిస్తే, అతనికి రూ.90 మిగులుతుంది. కొత్త రూల్స్‌ ప్రకారం.. ఈ మొత్తంపై 28% జీఎస్టీ అంటే రూ.25.2 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ తీసివేస్తే మనకు రూ.64.8 మాత్రమే వస్తుంది. 🤑 గతంలో రూ.90 వచ్చేది. ఇప్పుడు ఇదివరకులా గంటలకు గంటలు ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుతూ కూచుంటే.. మీకు అదృష్టం బాగుంది లాభం వస్తే అందులో ఒకవంతు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అంటే.. మీరు ఎంత ఆన్‌లైన్‌ గేమ్స్ లో మునిగిపోతే.. అంతా ప్రభుత్వానికి ఆదాయం. ఇంతకు ముందు పదో వంతు గేమింగ్ కంపెనీ తీసుకునేది. ఇప్పడు దానితో పాటు ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. మరి ఇకపై గేమ్స్ ఆడాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 🎮

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page