top of page
MediaFx

కిమ్‌ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది యువతులు..😲


ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కెల్లా ఉత్తరకొరియా తీరు వేరే ఉంటుంది. ఇక ఆ దేశ అధ్యక్షుడు, భయంకరమైన నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్ జోంగ్ ఉన్.. ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే మారుతూ ఉంటుంది. ఉత్తర కొరియాలో ఉన్నన్ని ఆంక్షలు, నిర్బంధాలు, సమాచారం బయటికి రాకపోవడం అనేది.. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒక వైపు దేశం ఆకలితో అలమటిస్తున్నా కిమ్ తన రాజభోగాలకు, శత్రువులను మట్టుబెట్టేందుకు క్షిపణి పరీక్షలకు మాత్రం ఎలాంటి లోటు రానీయరు. అయితే తాజాగా కిమ్‌కు సంబంధించి ఓ సంచలన విషయం బయటికి వచ్చింది.

కిమ్‌ను సంతోషంగా ఉంచేందుకు ప్రతీ సంవత్సరం 25 మంది యువతులతో కూడిన టీమ్ పని చేస్తుందని ఒక కథనం పేర్కొంది. అంతా 20 ఏళ్ల లోపు ఉన్న యువతులను తీసుకువచ్చి ఏడాది పాటు కిమ్ వద్ద ఉంచుతారని తెలిసింది. అయితే వారిని ఎంపిక చేసేందుకు పెద్ద ప్రక్రియ ఉంటుందని ఆ టీమ్‌లో నుంచి పారిపోయి బయటికి వచ్చిన ఓ యువతి ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ కథనం ప్రచురించారు. ఆ యువతులకు ఏ చిన్న మచ్చ గానీ, సమస్య గానీ ఉన్నా వారిని ఎంపిక ప్రక్రియ నుంచి పక్కన పెడతారు. అందం, అణిగిమణిగి ఉండే వారిని తీసుకువచ్చి.. వారికి మెడికల్ టెస్ట్‌లు చేసి ఫైనల్ చేస్తారు.

ఇక యువతులను సెలక్ట్ చేయడానికి కిమ్ సన్నిహితులు దేశం మొత్తం తిరిగి కొందర్ని ఎంపిక చేస్తారు. యువతుల రాజకీయ, కుటుంబ వివరాలు ఆరా తీస్తారు. గతంలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారిని.. దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో బంధువులు ఉన్న వారిని రిజెక్ట్ చేస్తారు. కొందరు యువతులను తీసుకువచ్చిన తర్వాత వారికి కన్యత్వ పరీక్షలు నిర్వహించి.. అందులో పాస్ అయినవారినే సెలక్ట్ చేస్తారు. ఏ చిన్న సమస్య ఉన్నా వారిని వెనక్కి పంపించేస్తారు. చివరికి 25 మందిని సెలక్ట్ చేసి.. వారిని రాజధాని ప్యాంగ్యాంగ్‌కు పంపిస్తారు. వారు చేయాల్సిన పని అంతా కిమ్‌ను అన్ని రకాలుగా సుఖపెట్టడమేనని.. ఆ టీమ్‌లో నుంచి పారిపోయిన పార్క్‌ అనే యువతి అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది.కిమ్ దగ్గరికి యువతులను పంపించేందుకు వారి కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలుపుతారని తెలుస్తోంది. అయితే తమ బిడ్డలను కిమ్ వద్దకు పంపిస్తే కనీసం ఆకలితో అలమటించకుండా ఉంటారని పంపిస్తారని సమాచారం. అయితే ఇలాంటి ఆచారం కేవలం ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిమ్‌ జోంగ్ ఉన్ హయాంలోనే మొదలు కాలేదని.. ఇది 1970 ల నుంచే అక్కడి అధ్యక్షులు ఇలా యువతులను ఎంపిక చేసుకోవడం ఉందని తెలుస్తోంది.


bottom of page