top of page

చేపల కోసం నదిలో వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి షాక్..!


తాజాగా కర్ణాటకలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలతో పాటు నదులు కూడా ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. నదుల్లో నీటిమట్టం పెరగడం వల్ల మత్స్యకారులకు చేపల పంట పండుతోంది. ఈ క్రమంలోనే చేపల వేటకు వెళ్లిన కొందరు నదిలో వల విసిరారు.. ఊహించని విధంగా వారి ఒక్కసారిగా బరువెక్కింది. పెద్దమొత్తంలో చేపలు చిక్కాయని భావించిన మత్స్యకారులు జాగ్రత్తగా వలను ఒడ్డుకు లాగారు. కానీ, వలలో చేపలకు బదులు 7 అడుగుల కొండచిలువ చిక్కింది. దాంతో, మత్స్యకార యువకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత వారు ఏం చేశారు.? ఈ కొండచిలువ ఏమైందో చూడండి. వలలో చిక్కిన కొండచిలువను చూసిన మత్స్యకార యువకులు, గ్రామస్తులు, స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. నిమిషాల్లో స్నేక్ ఎక్స్‌పర్ట్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వలలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న కొండచిలువను చూసిన స్నేక్‌ క్యాచర్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. వెంటనే అతికష్టం మీద దాన్ని బయటకు తీసే ప్రయత్నం మొదలుపెట్టాడు. దాదాపు అరగంట పాటు ప్రయత్నించి కొండచిలువను బయటకు తీయగలిగాడు. ఈ వీడియో ajay_v_giri Instagram అనే ఖాతాద్వారా షేర్‌ చేశారు. ఈ కొండచిలువను కాపాడేందుకు వచ్చిన స్నేక్‌ క్యాచర్స్‌ కర్ణాటక అటవీ శాఖ ఉద్యోగులుగా తెలిసింది. ప్రస్తుతం వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page