🔌 కర్ణాటకలో కరెంట్ కటకట ఇష్యూనే.. ⚡ తెలంగాణలో ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. 📢 కాంగ్రెస్ పార్టీని ఇరుకున్నపెట్టే ప్రయత్నం చేస్తోంది. 💪
ఈ క్రమంలో..బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ పోరు హీట్ పుట్టిస్తోంది. 🔥 ఐదు గంటల కరెంట్ కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా అని బీఆర్‌ఎస్ ప్రజల్లో ప్రచారం చేస్తోంది. 💡 అదేసమయంలో..మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కర్నాటకలో కరెంట్ కోతలపై మంత్రి కేటీఆర్ మరోసారి రియాక్ట్ అయ్యారు. 🎙 తెలంగాణలో కర్నాటక రైతుల ప్రచారాన్ని స్పాన్షర్డ్ అంటున్నారని.. కావాలంటే అక్కడకు వెళ్లి చూస్తే నిజాలు తెలుస్తాయన్నారు మంత్రి కేటీఆర్. 🌐
🌟 డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో.. 🔌 కర్ణాటకలో కరెంట్‌పై బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని టీ కాంగ్రెస్ భావించింది. 📢 అందులో భాగంగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా, మల్లిఖార్జున ఖర్గేను రంగంలోకి దించింది. 🤔 వారితోనే చెప్పించేందుకు ప్లాన్ చేసింది. 📅 శనివారం వికారాబాద్‌జిల్లా తాండూరులో ప్రారంభమైన రెండో విడత విజయభేరి బస్సుయాత్రలో డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 🚌 కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంట్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 💡 అనుమానం ఉంటే కేసీఆర్, కేటీఆర్ కర్ణాటకకు వచ్చి చూసుకోవాలన్నారు శివకుమార్. 🌐