top of page

'కన్నప్ప'లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్!🎬🌟

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో స్టార్ కాస్ట్ భారీగానే ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్ సూపర్ స్టార్లు భాగం కాగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో వచ్చి చేరాడు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రోజురోజుకూ స్థాయిని పెంచుకుంటూపోతోంది. 'కన్నప్ప' నుంచి వస్తోన్న అప్ డేట్లతో పాన్ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. 'కన్నప్ప' చిత్రం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి పడింది. రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ 'కన్నప్ప' సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాలో వారు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ‘కన్నప్ప’ జర్నీలోకి వచ్చారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో ముఖ్య పాత్రలో శివ రాజ్‌కుమార్ కనిపించబోతోన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. శివ రాజ్‌కుమార్ పాత్రకు సంబంధించిన అప్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ 'కన్నప్ప'లో భాగస్వామి అవుతుండటంతో అందరి ఫోకస్ ఈ మూవీపైనే ఉంది.🎬🌟


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page