top of page
MediaFx

గణపతి, కార్తికేయుడు మాత్రమే కాదు శివుడికి కూడా ఇతర సంతానం ఉందని తెలుసా..!

త్రిమూర్తులలో లయకారుడు శివుడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. శివపార్వతులను ఆదిదంపతులు అని అంటారు. వినాయకుడు, కార్తికేయుడు శివుని ప్రసిద్ధ సంతానం. కానీ శివుడికి ఇంకా సంతానం ఉన్నారు. వారి గురించి, మరియు ఆ దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు గురించి తెలుసుకుందాం.

అశోక్ సుందరి

అశోక్ సుందరి శివపురాణం, పద్మపురాణంలో ప్రస్తావించబడిన శివపార్వతుల కుమార్తె. కార్తికేయుడి తరువాత పుట్టిన ఆమెను పార్వతీ కల్పవృక్షం నుండి సృష్టించారు. దక్షిణ భారతదేశంలో ఆమెను బాలా త్రిపురసుందరి రూపంలో పూజిస్తారు.

మానసా దేవి

మానసా దేవి, వాసుకి అని కూడా పిలుస్తారు, శివుని కుమార్తె. ఆమె శివుని తల నుండి ఉద్భవించిందని చెబుతారు. మానసా దేవి హరిద్వార్‌లో ప్రసిద్ధ శక్తిపీఠంలో పూజించబడుతుంది. పాముకాటు నివారణ, సంతానోత్పత్తి, శ్రేయస్సు కోసం ఆమెను పూజిస్తారు.

అయ్యప్ప స్వామి

హరిహర తనయుడు అయ్యప్ప స్వామి, దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవత. పురాణాల ప్రకారం విష్ణువు మోహినీ రూపంలో ఉన్నప్పుడు శివుని ఆకర్షణలో ఉండి జన్మించిన అయ్యప్పను కేరళలోని శబరిమల ఆలయంలో ప్రధానంగా పూజిస్తారు. ఆయన పరశురాముడితో యుద్ధం చేయగల ఏకైక దేవుడు.

bottom of page