top of page
Shiva YT

టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్! ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనే అవకాశం!

ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో మెగా టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా ససేమిరా అన్నది.

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ 2023 (Asia Games 2023) సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్‌జౌ నగరంలో ఆరంభం కానున్నాయి. ఈ ఆసియా గేమ్స్ లో క్రికెట్‌ను కూడా భాగం చేశారు.

ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో మెగా టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా ససేమిరా అన్నది. 2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్‌ ఉన్నా... టీమిండియా పాల్గొనలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక క్రికెట్ జట్లు పాల్గొన్నా.. బీసీసీఐ మాత్రం తమ జట్టును పంపించలేదు.కానీ భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడి తేవడంతో ఈసారి జరిగే ఆసియా గేమ్స్ కు భారత్ ను కూడా పంపాలనే ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది.అయితే దీనిపై జూలై 7న జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుతున్న సమచారం ప్రకారం ఆసియా గేమ్స్ కు ద్వితియ శ్రేణి జట్టును పంపాలనే ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది.వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి యువ ప్లేయర్లతో ద్వితీయ శ్రేణి జట్టును ఆసియా గేమ్స్ కు పంపే అవకాశం ఉంది.ఈ లెక్కన యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మలకు ఆసియా గేమ్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కనుంది.జూలై 7న జరిగే అపెక్స్ కమిటీ మీటింగ్ లో మరో కీలక నిర్ణయాన్ని కూడా బీసీసీఐ తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ప్లేయర్స్ ను విదేశీ లీగ్స్ ఆడేందుకు ఒక పాలసీని తీసుకు రావాలనే అంశంపై చర్చింనున్నారు.


bottom of page