top of page

బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలపై తొలిసారి స్పందించిన షేక్‌ హసీనా..


బంగ్లాను వీడి వచ్చిన తర్వాత తన దేశంలో పరిస్థితులపై షేక్‌ హసీనా తొలిసారి స్పందించారు. అవామీ లీగ్‌ నేతలు, కార్యకర్తలు తదితరులపై జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో చోటు చేసుకున్న హత్యలు, విధ్వంసకాండలో భాగమైన వారిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా తన తండ్రి, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ (Sheikh Mujibur Rahman) విగ్రహం ధ్వంసం చేసినందుకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి హసీనా చేసిన ప్రకటనను.. ఆమె కుమారుడు సాజిబ్‌ వాజెద్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

‘ఆందోళనల పేరుతో కొందరు విధ్వంసానికి తెగబడ్డారు. హింసాత్మక ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆగస్టు 15న జాతీయ సంతాప దినం గౌరవప్రదంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బంగబంధు భవన్‌ వద్ద మృతులకు నివాళులర్పించాలని పిలుపునిస్తున్నాను. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపి.. కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి ’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page