top of page

‘దేవర’పై శాస్త్రి గారు అంచనాలు పెంచేస్తున్నారు..!


ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ఎన్టీఆర్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీవల విడుదలైన రెండో లిరికల్‌ సాంగ్‌కు కాస్త మిశ్రమ స్పందన వచ్చింది. అంతేకాదు ఈ సాంగ్‌పై సోషల్‌మీడియాలో చాలా ట్రోల్స్‌ కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆ సాంగ్‌ మెల్లగా చార్ట్‌ బస్టర్‌లో చేరిపోయింది. అయితే ఇప్పడు అందరి చూపు మూడో సాంగ్‌పై వుంది. త్వరలోనే ఆ సాంగ్‌ రాబోతుంది.

ఇక మూడో సాంగ్‌ గురించి గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి పెట్టిన పోస్ట్‌ రానున్న సాంగ్‌పై అంచనాలు పెంచే విధంగా వుంది. ” నిన్న రాత్రి నేను ఆయుధ పూజ సాంగ్‌ షూట్‌ చూస్తూ చాలా భావోద్వేగానికి గురయ్యాను. నా పక్కన వున్న దర్శకుడు శివ గారు డాన్స్‌ డ్యూయెట్‌ అయితే వేరే లెవల్‌ పూనకాలు అన్నారు. అదే మాట మీతో అన్నా నిజ్జంగా.. నిజ్జం.. అంటూ పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీంతో పాటు ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఈ చిత్ర సినిమాటోగ్రఫర్‌ రత్నవేలు కూడా ట్విట్టర్‌లో ఈ పాట గురించి పోస్ట్‌ చేస్తూ… పాట విజువల్‌గా ఎంత బాగుంటుందో.. అనిరుధ్‌ సంగీతం ఎలా వుంటుందో.. చెప్పేశాడు. దీంతో పాట విజువల్‌గా కూడా మరో స్థాయిలో వుంటుందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.



コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page