top of page
Suresh D

షూటింగ్​లో షారుక్​కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..

ఓ సినిమా షూటింగ్​లో షారుక్‌ ఖాన్​ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ముక్కుకు తీవ్రంగా గాయమైందని...దానికి సర్జరీ కూడా చేశారని సమాచారం. ప్రస్తుతం ఇంట్లోనే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ బాద్​ షా షారుక్‌ ఖాన్​కు​ ప్రమాదం జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్​లో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఓ సీన్ చేస్తుండగా షారుఖ్ ముక్కుకి దెబ్బతగిలి రక్తం కారింది. దీంతో వెంటనే మూవీ యూనిట్ ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. షారుఖ్ కు డాక్టర్లు చిన్న సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ తర్వాత షారుఖ్ ముక్కుకు కట్టుతో కనిపించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరి ఈ ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగిందనే విషయంపై షారుఖ్ కానీ, అతని బృందం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాదం తర్వాత షారుఖ్ ముంబైలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ ఏడాది పఠాన్‌తో తిరిగి ఫామ్ లోకి వచ్చారు షారుఖ్. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. అంతేకాకుండా ఈ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరాడు బాద్ షా. దంగల్‌ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన హిందీ మూవీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం షారుఖ్ నటించిన జవాన్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ సెప్టెంబరు 07న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై హిందీతో పాటు దక్షిణాదిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

bottom of page