top of page
Suresh D

షర్మిల పోటీ స్థానం ఖరారు చేసిన హైకమాండ్ - బిగ్ ఫైట్..!! 🗳️✨

ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. షెడ్యూల్ విడుదల కావటంతో పార్టీలు వ్యూహాలు ముమ్మరం చేసాయి. ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు. అటు కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల దూకుడుగా వెళ్తున్నారు. షర్మిల పోటీ స్థానం పైన పార్టీ నాయకత్వం స్పష్టత ఇచ్చింది. 

ఏపీలో ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్దుల జాబితా ఫైనల్ కానుంది. వైసీపీ నుంచి పార్టీ అభ్యర్దులను అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటి పైన ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ పైన కాంగ్రెస్ నాయకత్వం సూచన చేసినట్లు సమాచారం. 

షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ నాయక్వం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ సూచిస్తే ఎన్నికల్లొ పోటీ చేస్తానని షర్మిల చెబుతూ వచ్చారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం ప్రధానంగా ఎంపీ స్థానాల పైనే ఫోకస్ చేస్తోంది. అయితే, పార్టీ సూచన పైన షర్మిల తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. 

కడప ఎంపీగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే, సౌభాగ్యమ్మను కాంగ్రెస్ నుంచే పోటీ చేయించాలనే మరో ఆలోచన తాజాగా జరిగిన వివేకా సంస్మరణ సభలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలను కడప ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తుండటంతో...వివేకా కుటుంబం నుంచి పోటీ ఉండదనే అంచనా వ్యక్తం అవుతోంది. వైసీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన అవినాశ్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసులో అవినాశ్ పైన పలు ఆరోపణలు చేసింది. వైసీపీకి ఓటు వేయద్దంటూ తాజాగా తన తండ్రి సంస్మరణ సభలో పిలుపునిచ్చింది. 

ఇప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ సూచిస్తుండడటంతో బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా విడుదల కానుంది. పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తుండంతో టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు. దీంతో, షర్మిల ఎంపీగానే పోటీ చేస్తారా..లేక ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. 

bottom of page