జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా పరిగణిస్తారు. గత నెల 17వ తేదీ నుంచి ఆయన రివర్స్ లో నడవడం ప్రారంభించారు. ఈ స్థితిలో నవంబరు 4వ తేదీ వరకు ఉంటాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శని తిరోగమనం మూడు రాశులకు కలిసి రానుందని, శని కదలికవల్ల ఏయే రాశులవారు ప్రయోజం పొందనున్నారో తెలుసుకుందాం.
మకర రాశి : మకర రాశికి శని అధిపతి. శని సంచారం వీరికి కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది. పనిచేసేచోట వీరికి అంతా అనుకూలంగా మారుతుంది. అనుకున్నది సాధించడంతోపాటు పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. కెరీర్ ఇలా ముందుకు వెళుతుంటుంది. కోరికలన్నీ నెరవేరడంతోపాటు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
కుంభ రాశి : కుంభరాశికి కూడా శనే అధిపతి. శని తిరోగమన ప్రభావం ఈ రాశివారిని మానసిక ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. కెరీర్ లో ఉన్నతస్థానానికి చేరుకోవడంతోపాటు వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. పనిచేసే ప్రాంతంలో సహోద్యోగులు, పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. క్రీడా రంగం, పర్యాటక రంగంలో ఉన్న వ్యక్తులు ఈ సమయంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. వీరు అనుకున్నది సాధిస్తారు. అయితే వీరు అహంకారాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. అహంకారాం వీడితోనే విజయం సాధ్యమవుతుంది.
మీనరాశి : ఈ రాశివారికి ఇతరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. అన్నిచోట్లా స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు విజయం దక్కుతుంది. కెరీర్ లో మంచిస్థాయికి వెళతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడంతోపాటు ఆకస్మిక ధన లాభం ఉంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం పెరగడంతో లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతి లభిస్తుంది.