top of page

మూవీ లవర్స్‌కు ‘జవాన్‌’ టీమ్‌ బంపరాఫర్‌.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ..🎥🎞️

మీరింకా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమా చూడలేదా? టికెట్ల ధరలు అధికంగా ఉన్నాయని ఆగిపోతున్నారా? అయితే ఈ బంపరాఫర్‌ మీకోసమే. ఒక టికెట్‌ కొంటె మరొక టికెట్‌ ఉచితంగా పొందే ఆఫర్‌ను ప్రకటించింది జవాన్ చిత్రబృందం.

మీరింకా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమా చూడలేదా? టికెట్ల ధరలు అధికంగా ఉన్నాయని ఆగిపోతున్నారా? అయితే ఈ బంపరాఫర్‌ మీకోసమే. ఒక టికెట్‌ కొంటె మరొక టికెట్‌ ఉచితంగా పొందే ఆఫర్‌ను ప్రకటించింది జవాన్ చిత్రబృందం. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని షరతులు విధించింది బుక్‌ మై షో, పేటీఎం మూవీస్‌, పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీ పోలీస్‌ వెబ్‌సైట్లు/ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ఈ ఆఫర్‌ పొందవచ్చని జవాన్‌ మేకర్స్‌ తెలిపారు. గురువారం, శుక్రవారం, శనివారం (సెప్టెంబర్‌ 28-30) మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, సినిమా ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని షారుక్ ఖాన్ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. అభిమానుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాడు షారుక్‌. జవాన్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా తరచూ నెటిజన్లతో ముచ్చటిస్తున్నాడు బాలీవుడ్ బాద్‌షా. ఈ సందర్భంగా నే కొందరు అభిమానులు జవాన్‌ సినిమా టికెట్లపై డిస్కౌంట్‌ అడిగారు. వీటికి స్పందించిన షారుక్‌ ‘మీరు అంతా బాధపడకండి.. అంతా మంచే జరుగుతుంది’ అని బాలీవుడ్ స్టార్‌ హీరో రిప్లై ఇచ్చాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే జవాన్‌ టికెట్లపై డిస్కౌంట్‌ను ప్రకటించారు మేకర్స్‌.🎥🎞️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page