top of page

వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన షారుఖ్ ఖాన్ జవాన్..

ఈ ఏడాది మొదట్లో షారుక్ నటించిన ‘పఠాన్’ సినిమా జనవరి 25న విడుదలై వేల కోట్ల రూపాయలను రాబట్టింది. అప్పటివరకు బాలీవుడ్ లో సినిమాలన్నీ వరసగా ఫ్లాప్స్ అవుతూ ఉండటంతో అక్కడి ఫ్యాన్స్ నిరాశలో మునిగి పోయారు. అదే సమయంలో ఇతర బాషల సినిమాలు సంచలన విజయాలను అందుకోవడంతో పాటు రికార్డ్స్ క్రియేట్ చేశాయి.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ 2023లో అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆయన నటించిన రెండు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేశాయి. ఈ ఏడాది మొదట్లో షారుక్ నటించిన ‘పఠాన్’ సినిమా జనవరి 25న విడుదలై వేల కోట్ల రూపాయలను రాబట్టింది. అప్పటివరకు బాలీవుడ్ లో సినిమాలన్నీ వరసగా ఫ్లాప్స్ అవుతూ ఉండటంతో అక్కడి ఫ్యాన్స్ నిరాశలో మునిగి పోయారు. అదే సమయంలో ఇతర బాషల సినిమాలు సంచలన విజయాలను అందుకోవడంతో పాటు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అవే సినిమాలు బాలీవుడ్ లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఆ తర్వాత పఠాన్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో తిరిగి బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. ఇక ఇప్పుడు జవాన్ తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు షారుక్.

సెప్టెంబర్ 7న విడుదలైన ‘ జవాన్ ‘ సినిమా ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఇప్పటికి కూడా జవాన్ సినిమా థియేటర్స్ లో రాణిస్తుంది. మూడో వారాంతంలో కూడా ఈ సినిమా వసూళ్లు బాగానే రాబట్టింది. ‘పఠాన్’ విడుదలకు ముందు షారుఖ్ ఖాన్ సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. వరుస ఫ్లాపులు చూసి పదే పదే విమర్శలకు గురయ్యాడు కింగ్ ఖాన్. దాంతో అతనికి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. కానీ ‘పఠాన్’ సినిమా వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడంతో షారుక్ కెరీర్ కొత్త ఊపు వచ్చింది. ఇప్పుడు ‘జవాన్’ కూడా ప్రపంచవ్యాప్తంగా 1004 కోట్ల రూపాయలను రాబట్టి షారుక్ అభిమానులను పండగ చేసుకునేలా చేసింది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page