top of page
MediaFx

రోజుకి ఒక్క‌పూట మాత్ర‌మే తింటాను : షారుఖ్‌ ఖాన్‌


బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌కు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లో లేకుండా ఇండ‌స్ట్రీలోకి వచ్చి బాలీవుడ్ బాద్‌షా గా అవ‌త‌రించాడు. షారుఖ్‌కు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజారాధన కలిగి ఉన్న నటులలో షారుఖ్‌ ఒకడు. ఇక గ‌తేడాది ప‌ఠాన్, జ‌వాన్, డంకీ చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్‌ల‌ను అందుకున్నారు. అయితే ప్ర‌స్తుతం 58 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఈ స్టార్ హీరో ఎంతో ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తూ ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్‌కు పోటిగా నిలుస్తుంటాడు. అయితే తాను ఇంత ఫిట్‌గా ఉండ‌డానికి గ‌ల సీక్రెట్‌ను తాజాగా బయటపెట్టాడు షారుఖ్. త‌న అల‌వాట్ల గురించి త‌న లైఫ్‌స్టైల్ గురించి అభిమానుల‌తో తాజాగా పంచుకున్నాడు. అమెరిక‌న్ న‌టుడు మార్క్ వాల్‌బ‌ర్గ్ ఉద‌యం నిద్ర లేచే స‌మ‌యానికి నేను ఇక్క‌డ ప‌డుకుంటాను. మ‌న భాష‌లో చెప్పాలి అంటేఉద‌యం 5 గంట‌ల‌కు ప‌డుకొని మార్నింగ్ 9 లేదా 10 గంట‌ల‌కు లేస్తాను. త్వ‌ర‌గా రెడీ అయ్యి షూటింగ్‌కు వెళ్లిపోతాను. అనంత‌రం మ‌ళ్లీ నైట్ 2 గంట‌ల‌కు ఇంటికి వ‌స్తాను. ఇంటికి వ‌చ్చాక వ‌ర్క్అవుట్స్ చేసి స్నానం చేసి నిద్ర‌పోతాను. అలాగే రోజుకి ఒక్క‌పూట మాత్ర‌మే తింటాను ఇదే నా ప్ర‌తిరోజు దిన‌చ‌ర్య. నాలుగు సంవ‌త్స‌రాల పాటు నేను స్క్రీన్ మీదా కనిపించ‌పోయేస‌రికి నా అభిమానులు చాలా నిరాశ చెందారు. అందుకే వ‌రుస సినిమాలు చేస్తున్నా. ఇక‌పై మ‌ళ్లీ అలా చేయ‌ను అంటూ షారుఖ్ చెప్పుకోచ్చాడు.

డంకీ త‌ర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న షారుఖ్ తాజాగా కింగ్ అనే సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. సుజోయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించ‌నుండ‌గా.. అభిషేక్ బచ్చన్, ఫాహిమ్ ఫాజ్లీ, సుహానా ఖాన్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు.

bottom of page