ఇస్లామాబాద్, డిసెంబర్ 20: భారత్ నుంచి పారిపోయిన దావూద్ ఇబ్రహీంతోపాటు పలువురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా భారత్ హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టులు వరుస హత్యలకు గురవుతున్నారు.
భారత్‌కు అన్యాయం చేసిన వారిని ఎవరో టార్గెట్ చేసి మరీ హతమర్చుతున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? వారి మోటో ఏంటి అనే విషయం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. గడచిన రెండేళ్లలో ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న క్రమినల్స్ పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో మిస్టీరియస్‌గా చనిపోవడం అంతుపట్టకుంది. ఈ హత్యలపై పాక్ పెంచి పోషిస్తున్న నిషేదిత తీవ్రవాద సంస్థలు మౌనం వహించడం మరిన్ని అనుమానాలకు తీవిస్తోంది. హతమైన మిలిటెంట్ కమాండర్లందరూ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్ (హుమ్), జైషే మహమ్మద్ (జేఎం)తో సంబంధం ఉన్న వారే. నవంబర్ మొదటి పక్షం రోజుల్లో మౌలానా మసూద్ అజార్ సన్నిహిత సహచరుడు, ఎల్‌ఈటీ చీఫ్ రిక్రూటర్‌తో సహా ముగ్గురు సీనియర్ జేఈఎమ్ ఉగ్రవాదులు కాల్చి చంపబడ్డారు. 2021లో లాహోర్‌లో ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు, 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత నుంచి ఈ హత్యల పరంపర ప్రారంభమైంది. పైగా ఈ హత్యలన్నీ ఒకే పద్ధతిలో ఉండటం మరో విశేషం. ప్రతి సందర్భంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి భారత్‌లో తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాక్‌లో జరుగుతోన్న ఈ వరుస హత్యలపై పాకిస్థాన్ అధికారులతోపాటు మీడియా కూడా పెదవి విప్పడం లేదు. 🌐✉️🗞️