top of page
MediaFx

సీనియర్ జర్నలిస్టు ఆస్పత్రి బిల్లు మొత్తం కట్టేసిన చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. కరోనా లాంటి విపత్తుల సమయాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు అండగా నిలిచారు. చిరంజీవి సేవా కార్యక్రమాలు, దాన ధర్మాల గురించి మనకు తెలిసింది కొంతేనని, ఎవరికీ తెలియని గుప్త సహాయాలు చాలా ఉన్నాయని ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల తెలిపారు. అన్నయ్య ఆపద్భాందవుడని ప్రశంసలు కురిపించారు. దీనిని నిరూపిస్తూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఓ సీనియర్ జర్నలిస్టుకు ఆపన్న హస్తం అందించారు. ఆస్పత్రిలో ఒక్క రూపాయి కట్టనివ్వకుండా అన్నీ తానై చూసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ప్రముఖ సీనియర్‌ సినిమా జర్నలిస్టు సుబ్బారావు ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా చికిత్స ప్రారంభించారు. అయితే వైద్యం జరుగుతన్న సమయంలో ఆయనకు మధుమేహం‌ ఉందనే విషయం బయటపడింది. మూడు నెలల క్రితం తనకు డయాబెటిస్ వచ్చిందని సుబ్బరావు చెప్పారు. ఆ ఆసుపత్రి వైద్యులు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించారు. అయితే డాక్యుమెంట్స్ పరిశీలించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ టీమ్‌ సుబ్బారావు క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసింది. డయాబెటిస్ ఉందనే కారణంతో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను రిజెక్ట్ చేసినట్లు టీమ్ తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక సినిమా మీడియాలో ఉన్న స్నేహితులందరితోనూ మాట్లాడారు సుబ్బారావు. అదే సమయంలో మెగాస్టార్‌ చిరంజీవితో ఉన్న పరిచయంతో ఆయనకు ఓ మెసేజ్ చేశారు. అందులో తన పరిస్థితి గురించి వివరించారు. సుబ్బారావు మెసేజుకు వెంటనే స్పందించారు చిరంజీవి. వెంటనే ఫోన్ చేసి ‘ఏమైంది సుబ్బారావు? అసలు ఆ విషయాలన్నీ నువ్వు వదిలేశాయ్‌. నీ దగ్గరకు ఒక మనిషిని పంపిస్తున్నా. నువ్వు డిశ్చార్చి అయి ఇంటికి వెళ్లిపో. మిగతా వన్నీ చూసుకుంటాను’ అని చెప్పారట. అలా చిరంజీవి హామీతో వెంటనే సుబ్బారావు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారట.



bottom of page