top of page

సికింద్రాబాద్ 🏙️ వాసులకు కేంద్రం గుడ్‌న్యూస్..

తెలంగాణ ప్రజలకు మరో కానుక ప్రకటించింది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్లను విస్తరించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణలో ప్రజాసౌకర్యం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 175 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. 44వ నెంబరు జాతీయ రహదారి (కామారెడ్డి మార్గంలో), ఒకటో నెంబరు రాష్ట్ర రహదారి (సిద్దిపేట మార్గంలో) ఎలివేటెడ్ కారిడార్లు, టన్నెళ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు చాలా సౌకర్యం కలగనుంది. మౌలికవసతుల కల్పన ద్వారా ప్రజాజీవనాన్ని సులభతరం చేసేందుకు గత పదేళ్లుగా ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలకు అందిస్తున్న గ్యారంటీకి ఇదొక ఉదాహరణ అంటూ కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కంటోన్మెంట్ బోర్డు భూములు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు కేంద్ర మంత్రి.

🌆 దాదాపు 10వేల ఎకరాలు విస్తరించిన కంటోన్మెంట్‌ ఏరియాలో మూడు వేల ఎకరాల స్థలంలో సాధారణ ప్రజలు నివాసం ఉంటున్నారు. మిగతా ఏడు వేల ఎకరాల స్థలం ఆర్మీ, రైల్వే, కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉంటుంది. రోజు లక్ష మంది వరకు కంటోన్మెంట్ రోడ్ ద్వారా ప్రయాణం చేస్తుంటారు. నగరం నడిబొడ్డున ఉన్నా… అభివృద్ధికి మాత్రం చాలా ఉన్నామని కంటోన్మెంట్‌ పరిసర ప్రజలు చెబుతున్నారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కంటోన్మెంట్ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. 🏡🚗


Comments


bottom of page