top of page

ఆపరేషన్ వాలెంటైన్‌ మూవీ నుంచి 'గగనాల' సాంగ్ రిలీజ్!✨🎵

మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో వచ్చే 'గగనాల' లిరికల్‌ వీడియో సాంగ్‌ను తాగాజా మూవీ మేకర్స్ విడుదల చేశారు. హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్‌ నేపథ్యంలో సాగుతున్న ఈ మెలోడీ సాంగ్ మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. 

టాలీవుడ్ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ లేటెస్ట్ నటిస్తున్న సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్‌'. పాన్ ఇండియా కథాంశంతో వార్‌ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ రానుంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వంలో.. భారత వైమానిక దళంకు ఆకితం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'వందేమాతరం' పాటను అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో లాంఛ్ చేశారన విషయం తెలిసిందే. 

మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో వచ్చే 'గగనాల' లిరికల్‌ వీడియో సాంగ్‌ను తాగాజా మూవీ మేకర్స్ విడుదల చేశారు. హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్‌ నేపథ్యంలో సాగుతున్న ఈ మెలోడీ సాంగ్ మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. యాడ్ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్ హడ డైరెక్షనలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. వాస్తవ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బిగ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీ టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకోని టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ మూవీని ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాన్ని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు. ✨🎵


bottom of page