top of page

సీనియర్ సిటిజన్లకు SBI శుభవార్త..🤝

ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఎఫ్‌డిలు తక్కువ వడ్డీని కలిగి ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అయితే సీనియర్ సిటిజన్లకు శుభవార్త వచ్చింది. మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో రెట్టింపు ప్రయోజనం పొందవచ్చు.

ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఎఫ్‌డిలు తక్కువ వడ్డీని కలిగి ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అయితే సీనియర్ సిటిజన్లకు శుభవార్త వచ్చింది. మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో రెట్టింపు ప్రయోజనం పొందవచ్చు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టింది. పేరు ‘వి కేర్’ (SBI WeCare స్పెషల్ FD). ఈ పథకం ద్వారా లబ్ధిదారులు చాలా లాభదాయకమైన ప్రయోజనాలను పొందవచ్చు.కరోనా సమయంలో ఎస్‌బీఐ వారి సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక రక్షణగా ‘వీ కేర్ ఎఫ్‌డీ’ని అందించింది. ఈ పథకం 2020లో మార్కెట్లోకి వస్తుంది. తర్వాత దశలవారీగా మూడుసార్లు గడువు పొడిగించారు. ఈ పథకంలో వడ్డీ రేటు అలాగే రాబడులు చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించబడింది.ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్‌ల కోసం ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథకంలో సీనియర్ సిటిజన్‌లు అదనంగా 0.50 శాతం వడ్డీని పొందుతారు. ఈ పథకం 5-10 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ ఎఫ్‌డీ బుకింగ్ కోసం మీరు నెట్ బ్యాంకింగ్, yono యాప్‌ని ఉపయోగించవచ్చు. లేదా బ్యాంకు శాఖను సంప్రదించవచ్చు. ఈ ఎఫ్‌డీపై వడ్డీ నెలవారీగా, వార్షికంగా, సెమీ వార్షికంగా లేదా త్రైమాసికంగా అందుబాటులో ఉంటుంది. అయితే, టీడీఎస్‌ తీసివేయబడుతుంది. ఈ స్కీమ్ లో పదేళ్లలో రెట్టింపు ఆదాయం పొందవచ్చు.🤩


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page